దిల్లీ లిక్కర్ స్కామ్.. నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈనెల 16వ తేదీకి తీర్పు వాయిదా వేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 16 మ.3 గంటలకు బెయిల్‌ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఈడీ  కోరింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

ఇక దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇవాళ మరొకరు అరెస్టయ్యారు. ఈ స్కామ్‌లో ఈడీ మరొకరిని అరెస్టు చేసింది. చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చాయి. కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు… ఆయణ్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version