ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ గడువును మే 12వ తేదీ వరకు పొడిగించింది స్పెషల్ కోర్టు. నేటితో ఆయన రిమాండ్ ముగియడంతో రౌస్ ఎవెన్యూ కోర్టులో కోర్టులో హాజరు పరిచారు దర్యాప్తు అధికారులు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆయన గడువును పొడిగిస్తూ తీర్పునిచ్చారు.
దీంతో మనీష్ సిసోడియాని తీహార్ జైలుకు తరలించారు. ఇక మరోవైపు సిసోడియా బెయిల్ పిటిషన్ పై నిన్న వాదనలు విన్న కోర్టు.. ఆ తీర్పును ఈ నెల 28 కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఎక్సైజ్ విధానాన్ని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 26వ తేదీన సిసోడియా సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.