మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్థానంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నూతన సీఎంగా వస్తారని ఆయన తెలిపారు.
బీజేపీ నేత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ప్రచారాన్ని కొట్టిపడేశారు. మహారాష్ట్రకు ఏక్‌నాథ్ షిండేనే సీఎం అని, ఆ పదవిలో ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్సీపీ, శివసేన్(షిండే టీమ్)లో దీనిపై క్లారిటీ ఉందని చెప్పారు. అజిత్ కు కూడా తాను మహా సీఎం కాలేననే విషయం తెలుసుని అన్నారు. జులై 2న జరిగిన సమావేశానికి ముందే ఇదంతా వివరించామని ఫడణవీస్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి మార్పు ఉండదనని తేల్చి చెప్పారు.