అయోధ్య సీతమ్మకు 60 మీటర్ల ‘ధర్మవరం పట్టుచీర’

-

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్ భారతదేశం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్య బాలరాముడికి తమ శక్తికి తగ్గట్లుగా భక్తితో కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ చేనేత కుటుంబం అయోధ్య సీతమ్మ కోసం ప్రత్యేకమైన చీర తయారు చేసింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రెండు చేనేత కుటుంబాలు, సీతమ్మ కోసం సిద్ధం చేసిన ఈ చీరకు చాలా ప్రత్యేకత ఉంది.

అత్యంత భక్తి శ్రద్ధలతో 4 నెలల పాటు నేసిన ఆ పట్టు చీర విశేషాలేంటంటే..?

సీతమ్మ కోసం తయారుచేసిన పట్టు చీర 60 మీటర్ల పొడవు ఉంది.

ఈ చీర బార్డర్లకు రామాయణ ఘట్టం మొత్తాన్ని చిత్రాలుగా నేశారు.

ఈ చిత్రాలు కంప్యూటర్‌లో రూపొందించుకుని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుచీర అంచులపై చూపించారు.

5 లక్షల రూపాయల విలువైన పట్టుచీరను పూర్తిగా నాణ్యమైన పట్టుతో తయారు చేశారు.

అయోధ్య రాముడి ప్రాణమైన సీతమ్మకు ఈ పట్టు చీరను బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ చేనేత కుటుంబాలు చెబుతున్నాయి. అయోధ్యకు పంపే ముందు ధర్మవరంలో ఈ చీరను, ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచినట్లు తెలిపారు. అయోధ్యలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యాక, చీరను తీసుకెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version