వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివ కుమార్‌

-

హాసన్ సెక్స్‌ కుంభకోణం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, డీకే శివకుమార్‌ తోసిపుచ్చారు. అభ్యంతరకర వీడియోలు వైరల్‌ కావడం వెనుక ప్రజ్వల్ రేవణ్ణ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఉన్నారని ఆరోపించారు. కుమార స్వామి బ్లాక్‌మెయిలింగ్‌ కింగ్ అని, ఈ మొత్తం కథకు దర్శకుడు, నిర్మాత, ప్రధాన పాత్రధారి ఆయనేనని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

 

ఆ పెన్‌డ్రైవ్ వ్యవహారం గురించి కుమారస్వామికి మొత్తం తెలుసు అని దీనిపై కొందరు ఇప్పటికే మాట్లాడుతున్నారని శివకుమార్‌ తెలిపారు. కుమారస్వామి తన రాజీనామా అడుగుతున్నారని చూస్తుంటే వక్కళిగల నాయకత్వం కోసం పోటీ ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు.ఆయన కోరుకున్నట్టుగా తనను రాజీనామా చేయనివ్వండని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఒకరి తర్వాత ఒకరిని తొక్కేయడమే కుమారస్వామి పని అని ఆరోపించారు.

మరోవైపు మహిళ కిడ్నాప్‌ కేసులో అరెస్టైన మజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడు ఎమ్మెల్యే రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ అధికారులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన తన తల్లి కిడ్నాప్‌కు గురైందని బాధితురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కిడ్నాప్‌, అక్రమంగా బంధించటం వంటి సెక్షన్ల కింద రేవణ్ణపై కేసు నమోదైంది. మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌ విదేశాల్లో తలదాచుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version