సీఎం తల్లితో డాక్టర్ అసభ్య ప్రవర్తన.. విచారణకు సీఎంవో ఆదేశం

-

హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి సుఖ్విందర్​ సింగ్ సుఖు తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో ఓ ఆస్పత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఆయన తల్లి ఆరోపించారు. హమీర్​పుర్​ జిల్లాలో ఏప్రిల్​ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వియషంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్.. విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే.. సుఖ్విందర్​ సింగ్​ సుఖు తల్లి సంసారో దేవి ఏప్రిల్​ 9న కడుపునొప్పితో నాదౌన్​ సివిల్​ ఆస్పత్రికి వెళ్లారు. ఆమె వెంట ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్​ అసభ్యంగా ప్రవర్తించారని సంసారో దేవి ఆరోపించారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజే సీఎం సుఖ్విందర్.. హమీర్​పుర్​లో పర్యటించారు. జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్​ 10న హమీర్​పుర్​ చేసుకున్న సుఖ్విందర్​.. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్​ను (సీఎమ్​ఓ) వివరణ కోరారు. అనంతరం డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు అధికారులు.

అయితే, షోకాజ్​ నోటీసుకు సమాధానం ఇచ్చిన డాక్టర్​.. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని.. రోగితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరినట్లు చెప్పారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు సమాధానమిచ్చాడు. వైద్యుడి స్పందన అనంతరం.. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ ఆర్​కే అగ్నిహోత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version