ఈనెల 10న దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈ నెల 10న మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంలో సేకరించిన అదనపు ఆధారాలతో ఈడీ ఏప్రిల్‌ 6న, 27న అనుబంధ ఛార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేసింది.

అందులో ఇప్పటివరకు అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, అమిత్‌ అరోడా, గౌతమ్‌ మల్హోత్రా, రాజేష్‌ జోషి, రాఘవ్‌ మాగుంట, అమన్‌ ధల్‌,  అరుణ్‌పిళ్లై, మనీష్‌ సిసోదియాల పాత్ర గురించి వివరించింది. ఈ కేసుతో సంబంధమున్న 38 మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లనూ పొందుపరిచినట్లు ఈడీ తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు తెలిపారు.

27 నాటి అనుబంధ ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఇండోస్పిరిట్‌ సంస్థతో ఎమ్మెల్సీ కవితకున్న సంబంధం గురించి వివరించింది. దిల్లీ మద్యం సిండికేట్‌లో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంట కీలకపాత్ర పోషించినట్లు ఈడీ తన అనుబంధ ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version