మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్నికల కమిషన్

-

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఫైనల్‌ కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉండనుంది. ఈ సందర్భంగా జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

The Election Commission will announce the schedule of Maharashtra and Jharkhand elections

వాస్తవంగా మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్, 2024లో ముగుస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి, 2025లో ముగుస్తుంది. ఈ తరుణంలోనే.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఫైనల్‌ కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగియనుంది.మహారాష్ట్రలో, ఏక్‌నాథ్ సిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి దాని మిత్రపక్షాలు — శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) మరియు ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం)తో కలిసి మరో దఫా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version