చెట్టును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

-

కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటన  ఉత్తర్​ప్రదేశ్​లోని హర్డోయ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. వీరంతా బరాకాంత్​ నుంచి నయాగావ్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

హర్డోయ్ జిల్లాలోని ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవేపై ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు.  కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్​ కట్టర్లు వినియోగించాం. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఉన్నారు. బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాము. ప్రమాదానికి గల పూర్తి కారణాలను ఆరా తీస్తున్నాం. అని హర్డోయ్ జిల్లా పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version