ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్‌..నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

-

  • మళ్ళీ మొదలయిన రైతుల ఆందోళన
  • నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు బంద్

ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్‌ నెలకొంది. ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ మొదలయింది. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఇవాళ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్‌ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని పిలుపునిచ్చారు రైతు సంఘాల నాయకులు.

Farmers’ unions have called for a Punjab bandh today

బంద్ నేపథ్యంలో పంజాబ్ మీదుగా వెళ్లే 163 రైళ్లను రద్దు చేసింది నార్తర్న్ రైల్వే. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‍తో రైతులు ఆందోళనకు దిగారు. ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీ బోర్డర్ల వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్‌ నెలకొంది. ఇక ఈ అంశంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version