‘టార్గెట్ 370’.. నలుగురు కేంద్రమంత్రులకు బీజేపీ టికెట్లు

-

రానున్న లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా సీట్లు గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచార వ్యూహాలకు పదును పెడుతూ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. తాజాగా బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. వారితో పాటు ఇటీవలే హర్యానా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ పేరు కూడా ఉంది.

72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌, ప్రహ్లాద్ జోషీతో పాటు హర్యానా మాజీ సీఎం మనోహర్‌ లాల్ ఖట్టర్‌ పేర్లు ఉన్నాయి. ఖట్టర్ కర్నాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. రెండో జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్‌ హవేలీ (1) దిల్లీ (2), గుజరాత్‌ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్‌(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్‌ (5), మహారాష్ట్ర(20), త్రిపుర (1), ఉత్తరాఖండ్‌ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version