దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసు అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురు వారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు – 2022 అనే పేరిట విడుదల చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం దేశంలో చాలా రాష్ట్రాల్లో లోక్ సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని రూ. 95 లక్షలు అని తెలిపింది. అలాగే అసెంబ్లీ స్థానానికి ఎన్నికల పరిమితి రూ. 40 లక్షలు అని తెలిపింది. అయితే గోవా, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కిం రాష్ట్రాలల్లో లోక్ సభ ఎన్నికల్లో రూ. 75 లక్షలుగా నిర్ణయించారు. అలాగే ఈ మూడు రాష్ట్రాలతో పాటు మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు రూ. 28 లక్షలు కేటాయించారు.
అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో జమ్ము కాశ్మీర్, ఢిల్లీ లలో లోక్ సభ ఎన్నికల్లో రూ. 95 లక్షలు మిగిలిన ప్రాంతాలలో రూ. 75 లక్షలుగా కేటాయించారు. అలాగే ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలలో అసెంబ్లీ స్థానాలకు రూ. 40 లక్షలు, మిగిలిన ప్రాంతాలల్లో రూ. 28 లక్షలు గా కేటాయించారు.