లోకో పైలట్లు లేకుండానే 70 కి.మీ దూసుకెళ్లిన గూడ్స్‌!

-

ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పంజాబ్లో ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్స్ రైలు దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. 53 వ్యాగన్లతో కూడిన రైలు జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని ఓ గ్రామం వరకు అలాగే ప్రయాణించింది. మార్గమధ్యలో దాదాపు గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీసినట్లు సమాచారం.

చిప్‌ స్టోన్లతో నిండిన 53 వ్యాగన్ల గూడ్స్‌ రైలు జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌కు బయలుదేరగా మార్గమధ్యలో డ్రైవర్‌ ఛేంజ్‌ కోసం కథువా రైల్వే స్టేషన్‌లో ఆగింది. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండానే లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌లు దిగిపోవడం వల్ల రైలు మెల్లగా పరుగులు పెట్టడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్లాక అది మరింత వేగం పుంజుకుని అలా దాదాపు 78కి.మీ మేర ప్రయాణించింది. వాలు కారణంగానే రైలు కదిలినట్లు అధికారులు భావిస్తున్నారు.

అప్రమత్తమైన అధికారులు దాన్ని నిలిపే ప్రయత్నం చేయగా చివరకు పంజాబ్‌ హోషియార్‌పుర్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ డివిజనల్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రతీక్‌ శ్రీవాస్తవ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version