గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగులు తేడాతో పరాజయం పారైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వదేరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ముంబై 152/9 రన్స్ కి పరిమితమైంది.
గుజరాత్ బౌలర్లలో నూర్ 3, రషీద్, మోహిత్ చెరో 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు. కాగా, IPL లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్ రైడర్స్ టీమ్ లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగుళూరు నాలుగింటిలో గెలిచింది. కోల్కతా కూడా ఏడు మ్యాచ్లు ఆడినా కేవలం రెండింటిలోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో RCB 5, KKR 8 స్థానాల్లో ఉన్నాయి.