హ్యాపీ బర్త్ డే మోదీజీ.. సీక్రెట్ ఆఫ్ సక్సెస్.. లీడర్ ఆఫ్ భారత్..

-

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు తదితరులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ టాప్ 3నే ఆయన లక్ష్యం..

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఎకానమిగా అవతరించింది. ఇప్పుడు టాప్‌3నే ఆయన టార్గెట్‌. ఎప్పుడూ దేశాభివృద్ధి కోసం ఆలోచించే మోదీ.. ప్రకృతి, పర్యావరణం జీవవైవిధ్యం పట్ల ఎంతో ప్రేమ ఉంది. జీవవైవిధ్యం, ప్రకృతి పరిరక్షణపై ఆయన దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు.. చిన్నతనం నుంచే ఆయన ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. యుక్త వయస్సులోనే హిమాలయాలకు వెళ్లిన మోదీ.. చాలా కాలం అక్కడే గడిపారు. అక్కడి ప్రజలను కలుసుకున్నారు.. పర్వతాలలో తిరుగుతూ ప్రకృతికి దగ్గరయ్యారు.

ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ..

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా పేరుతో పలు కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సేవా పఖ్వాడా కింద నేటి నుంచి ఈ నెల 24 వరకు ‘ఆయుష్మాన్ భవ వారోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్ యోజన కింద పేదలకు ఈ-కార్డులు పంపిణీ చేయనున్నారు. అదే టైంలో అక్టోబరు 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని మోడీ ప్రారంభించనున్నారు.

సామూహిక ప్రార్థనలు..

అలాగే, ప్రసిద్ధ ఇండియా గేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అలాగే ఢిల్లీలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌లో ఆయన దీర్ఘాయువు, మెరుగైన ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇక, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఔట్ పేషెంట్ విభాగం ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version