కాంగ్రెస్ ఐదు గ్యారంటీ ప్రోగ్రాంపై మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కొంతమంది సెప్టెంబర్ 17పు లేని అపోహలను సృష్టిస్తున్నారు అని పేర్కొన్నారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దేశ మనుగడకు అలాంటి వారు చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
తెలంగాణలో ఓట్ల రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా సమాజానికి ఉందన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ప్రత్యామ్నాయం ఏదీ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. కానీ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు జరిగిన మేలు ఏమిటో..? కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసు అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.