మహాకుంభ మేళాకు భారీ ట్రాఫిక్ జామ్..50 కిలో మీటర్ల లైన్!

-

మహాకుంభ మేళాకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తరప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Heavy Traffic Jam At Maha Kumbh Mela Prayagraj

మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు ఆ తర్వాత కాశీకి ఎక్కువగా వెళ్తుండటంతో తీవ్రమైన రద్దీ నెలకొందని సమాచారం. ఇక అటు కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు వెళ్లాడట ఓ ఉద్యోగి.

అదృశ్యం అయిన ఉద్యోగి దీపాలి సుబ్రహ్మ ణ్యంగా గుర్తించారు. టీటీడీ నుంచి సుమారు 250 మంది సిబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో దారాగంజ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో… కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం అయినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news