ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి.. కోల్‌కతా ఘటనపై కేంద్ర హోంశాఖ

-

కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

“దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలి. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటాం. అయితే, హత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కోర్టు సీబీఐకు అప్పగించింది.” అని కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జాతీయ స్థాయిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, కళాశాల, ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని అన్ని వైద్యకళాశాలలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version