వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లక్నోలో జరిగే ఉంటే టీం ఇండియా గెలిచి ఉండేది అంటూ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వాక్యాలు చేశారు. “మ్యాచ్ గుజరాత్ రాష్ట్రంలో కాదు. లక్నోలో జరగాల్సింది. టీం ఇండియాకు విష్ణువు, అటల్ బిహారి వాజ్ పేయి ఆశీస్సులు లభించేవి. భారత్ కూడా కప్ గెలిచేది. అక్కడ పిచ్ సమస్యతోనే మనం ఓడిపోయినట్లు తెలుస్తోంది’ అని ఓ సమావేశంలో అఖిలేష్ వాక్యానించారు.
అటు భారత ప్లేయర్లు తల ఎత్తుకోండని కోరారు దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపై దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ కీలక వాక్యాలు చేశారు. ‘మీ ప్రదర్శన పట్ల దేశం హర్షిస్తోంది. ఛాంపియన్స్ లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదు. మీరు ఎప్పుడో విజేతలుగా నిలిచారు. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తోంది. ఇది కష్టకాలమని నాకు తెలుసు. స్ఫూర్తిని కోల్పోవద్దు. యావత్ భారత్ మీకు మద్దతుగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.