వరల్డ్ టాప్​ 150 యూనివర్సిటీల్లోకి ఐఐటీ బాంబే, దిల్లీ

-

లండన్‌ కేంద్రంగా ఉన్నత విద్యపై విశ్లేషణలు చేసే QS సంస్థ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్‌-2025 పేరిట నివేదిక విడుదల చేసింది.  ఐఐటీ-బాంబే, ఐఐటీ-దిల్లీలు ప్రపంచ టాప్‌ 150 విశ్వవిద్యాలయాల్లో చోటు దక్కించుకున్నాయి. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వరుసగా 13వ సారి ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్శిటీగా మొదటి ర్యాంకును నిలబెట్టుకుంది.

గతేడాది 149వ ర్యాంకులో ఉన్న ఐఐటీ బాంబే ఈ దఫా 31 స్థానాలను మెరుగుపరుచుకొని 118వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఐఐటీ దిల్లీ 47 పాయింట్లను అధికంగా పొంది 150వ ర్యాంకులో నిలిచింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో దిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో నిలిచింది. మరోవైపు  క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ప్రపంచ సగటు 23.8 శాతంగా ఉంది. అయితే భారత్‌లో పది పాయింట్లు తక్కువగా ఉందని QS నివేదిక పేర్కొంది. విశ్వవిద్యాలయాల్లో విదేశీ ఆచార్యులు, విద్యార్థుల అంశంలో కూడా భారత్‌ వెనుకంజలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version