Chandrababu: ఈ 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూముల విలువ తగ్గింపు..!

-

 

రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కీలక ప్రకటనచేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ కమిషనర్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఆధ్వర్యంలోని కమిటీలు ప్రజల నుండి అభ్యంతరాలు ఇప్పటికే స్వీకరించినట్లు ఇందులో పేర్కొన్నారు.

ap-lands

వాటిని పరిగణలో పెట్టుకుని భూముల మార్కెట్ వాల్యూను రివైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇవాల్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన మార్కెట్ విలువలు అమలులోకి…. రానున్నాయి. మార్కెట్ విలువల్లో మార్పులకు సంబంధించి registration.ap.gov.in వెబ్సైట్లో ఉదయం 10 గంటల నుంచి వివరాలు అందుబాటులో ఉంటాయి అని వెల్లడించింది సర్కార్‌.

భూముల విలువల సవరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9054 వార్డుల్లో భూముల విలువ సవరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అని వెల్లడించింది. 158 గ్రామాలు, 145 వార్డులు లలో భూములు విలువ తగ్గించబడ్డట్టు పేర్కొంటూ ప్రకటన చేసింది సర్కార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version