భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది : ప్రధాని మోడీ

-

భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాజ్యాంగ చర్చకు ప్రదాని మోడీ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా లోక్ సభలో ప్రధాని నరేంద్ర ప్రసంగించారు. ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటున్నాం. ప్రజా స్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాం. దేశ ప్రజలకే మొదట ఆ ఘనత దక్కింది.భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.  మదర్ ఆప్ డెమెక్రసీగా పేర్గాంచింది. రాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని పేర్కొన్నారు.

pm modi

మహిళా బిల్లును సభ ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పారు. రాజ్యాంగ సభలో 18 మహిళలు ఉన్నారు. రాజ్యాంగ చర్చలో వారు చాలా చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. జీ20 సదస్సులో మనం మహిళా ఆదారిత అభివృద్ధి అంశాన్ని చర్చలో పెట్టామన్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version