రూ.12,000 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన భారత్ పశ్చిమ తీరదళం

-

డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సరిహద్దుల నుంచి డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత పశ్చిమప్రాంత తీరదళం రూ.12,000 కోట్ల విలువ చేసే 2,500 కిలోల మాదకద్రవ్యాలను పట్టుకొంది.

దేశంలో ఇంత పెద్దమొత్తంలో మెథంఫెటమిన్‌ పట్టుబడటం ఇదే మొదటిసారి అని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్‌ సముద్రగుప్త్‌’లో భాగంగా భారత నౌకాదళంతోపాటు యాంటీ నార్కోటిక్స్‌ ఏజెన్సీ సంయుక్తంగా ఈ డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌, ఇరాన్‌ల సమీపంలో ఉన్న మక్రాన్‌ తీరం నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన ఓ భారీ నౌక దారి పొడవునా ఇతర పడవలకు డ్రగ్స్‌ పంపిణీ చేస్తూ వస్తున్నట్లు వివరించారు.

పాకిస్థాన్‌ జాతీయుడైన ఓ వ్యక్తితోపాటు 134 సంచుల్లో ఉన్న మెథంఫెటమిన్‌ను ఈ నౌక నుంచి స్వాధీనం చేసుకొని కేరళలోని కొచ్చిన్‌ రేవులో ఎన్‌సీబీకి నౌకాదళం అప్పగించినట్లు అధికారులు చెప్పారు. ఈ సంచుల్లో ఉన్న డ్రగ్స్‌ ఉన్నత ప్రమాణాలకు చెందినదిగా గుర్తించినట్లు తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version