ఎట్టకేలకు వాటిపై స్పందించిన నిహారిక..!

-

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగుతోంది. మరీ ముఖ్యంగా వివాహం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది నిహారిక. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఆ తర్వాత కుటుంబంలో కలహాలు.. ఇక ఇప్పుడు భర్తతో విడిపోతున్నట్లు వార్తలు.. అన్నీ కూడా ఆమెను మరింత వైరల్ గా మారుస్తున్నాయి. అయితే ఇలా విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నా.. వాటిపై మాత్రం స్పందించలేదు నిహారిక . అటు ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఇక అక్కడితో ఆగకుండా ఆమె విడాకులు తీసుకోబోతుందని.. గర్భవతి కూడా అయిందని ఇలా ఎన్నో పర్సనల్ విషయాల వల్ల ఆమె హైలెట్ అవుతూ వచ్చింది. పెళ్లికి ముందు యాంకర్ గా, హీరోయిన్ గా కూడా వ్యవహరించిన నిహారిక పెళ్లి తర్వాత నటనకు గుడ్ బాయ్ చెప్పి నిర్మాతగానే వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిహారిక ప్రమోషన్స్ లో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు, మీమ్స్ గురించి కూడా మొదటిసారి స్పందించింది.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నేను పెద్దగా పట్టించుకోను..ఒకప్పుడు ఆ కామెంట్లు చూసేదాన్ని.. కానీ ఇప్పుడు లైట్ తీసుకున్నాను.. అందులో కొన్ని సిల్లీగా అనిపిస్తాయి వాటిని చూస్తే నువ్వు కూడా వస్తుంది అంటూ వెల్లడించింది. ఇలా తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది కానీ విడాకుల విషయంపై మాత్రం ఈ ముద్దుగుమ్మ స్పందించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version