ఆసీస్ పై టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న యువ భారతజట్టుపై బీసీసీఐ కార్యదర్శి జైశా ప్రశంసలు కురిపించారు. ‘నాలుగో టీ20లో ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభం ఇచ్చారు. ఫియర్ లెస్ క్రికెట్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చిన రింకు సింగ్, జితేష్ శర్మలకు సెల్యూట్. అక్షర్ పటేల్ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. సిరీస్ సాధించిన జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్ కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉండగా భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ లను తాను ఫాలో అవుతున్నానని, ఒకవేళ లైవ్ మిస్ అయితే హైలైట్స్ కచ్చితంగా చూస్తానని విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ చెప్పారు. ముఖ్యంగా రింకూ సింగ్ బ్యాటింగ్ కోసమే తాను మ్యాచ్ వీక్షిస్తానన్నారు. అతని సత్తా తనకు తెలుసని, కేకేఆర్ జట్టు ప్రాక్టీస్, నెట్స్ లో భారీ షాట్లు ఆడేవాడని గుర్తు చేసుకున్నారు. అతను అద్భుతమైన ఆటగాడని, భవిష్యత్తులో మరింత రాణిస్తాడని పేర్కొన్నారు.