గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం నుంచి జైహింద్ తొల‌గింపు.. త‌మిళ‌నాడు త‌లెత్తుకుంద‌న్న ఈశ్వ‌ర‌న్‌!

-

త‌మిల‌నాడులో అధికారంలోకి వ‌చ్చిన డీఎంకే ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇక తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం నుంచి జైహింద్ ను తొల‌గించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మే2న ఏర్ప‌డ్డ ప్ర‌భుత్వం తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ద్వారా అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో జైహింద్ లేక‌పోవ‌డం గ‌మనార్హం.

డీఎంకే చీఫ్ ఈశ్వ‌ర‌న్/ జైహింద్

పోయిన ప్ర‌భుత్వ హాయంలో వ‌చ్చిన జైహింద్ నినాదం ఈసారి రాలేదు. ఇక దీనిపై డీఎంకే మిత్రపక్షం అయిన కేడీఎంకే చీఫ్ ఈశ్వ‌ర‌న్ మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం నుంచి జైహింద్ తొలగించ‌డంతో త‌మిళ‌నాడు స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని చూస్తోంద‌ని చెప్పారు.

అయితే గవర్నర్ ప్రసంగాన్ని ఎప్పుడైనా సాధారణంగా ప్రభుత్వమే తయారు చేయ‌డం ప‌రిపాటి. మ‌రి ఈ సారి ఆ బాధ్య‌త తీసుకున్న డీఎంకే ప్ర‌భుత్వం జై హింద్ ను తొలగించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రచారంతో పాటే జై హింద్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఈశ్వ‌ర‌న్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ లేదా జాతీయవాద అనుకూల ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఆయ‌న‌కు అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version