చైనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకరణ చేసింది. Hmpv అనే వైరస్ తో ఎవరు భయపడకూడదని… తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 4 చైనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా కీలక ప్రకటన చేయడం జరిగింది.
ఈ చైనా వైరస్ ఇండియాకు కొత్తదేమీ కాదని ఆయన వివరించారు. 2001 సంవత్సరంలోనే గుర్తించినట్లు… జేపీ నడ్డా ప్రకటన చేయడం జరిగింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా… కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ గా ఉందని వివరించారు. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో ఎవరు భయపడకూడదు అని కోరారు. జాగ్రత్త అవసరం కానీ ఆందోళన పడాల్సిన పనిలేదని… దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా భరోసా కల్పించారు.