కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రూ.10 వేల జరిమానా

-

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు మంగళవారం రోజున హైకోర్టు రూ.పది వేల జరిమానా విధించింది. సంతోశ్‌ పాటిల్‌ అనే గుత్తేదారు బలవన్మరణం కేసులో అప్పటి మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బెంగళూరు రేస్‌కోర్సు రోడ్డులో 2022 ఏప్రిల్‌ 14వ తేదీన ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, రామలింగారెడ్డి తదితరులపై చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానంలో కేసు నమోదైంది.

తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తాజాగా సిద్ధరామయ్య హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సిద్ధరామయ్య చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ తోసిపుచ్చారు. మార్చి 6వ తేదీన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించారు. అంతే కాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.10 వేల జరిమానా చెల్లించాలని చెప్పారు. మార్చి 6వ తేదీన రామలింగారెడ్డి, 11వ తేదీన రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, మార్చి 15వ తేదీన ఎంబీ పాటిల్‌లు కోర్టు ముందు హాజరు కావాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version