దేశం కోసం పుట్టాను.. దేశం కోసం చస్తాను – ఢిల్లీ సీఎం కేజ్రివాల్

-

దేశం కోసం పుట్టాను.. దేశం కోసం చస్తానంటూ ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిబిఐ కార్యాలయానికి వెళ్లే ముందు వీడియో రిలీజ్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్.. సిబిఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు. కేజ్రివాల్ ను అరెస్టు చేస్తామంటూ బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు.. బిజెపి అధికార అహంకారం తో వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.

మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బిజెపి వ్యవహరిస్తుందని.. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తానని వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదెళ్ళ క్రితం అడుగులు వేశానని.. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని చెప్పారు. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారని.. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టానని పేర్కొన్నారు. 30 ఏళ్లలో గుజరాత్ లో ఏం అభివృద్ధి చేశారు… నా జీవిత లక్ష్యం భారత్ ను ప్రపంచంలో నెంబర్ వన్ గా చేయడం అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రివాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version