సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్‌

-

దిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి విన్నవించారు.

మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దిల్లీలో పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. ఆప్ మంత్రులు చేస్తున్న ఈ ఆందోళనలతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ భరద్వాజ్తో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఆప్‌ఎమ్మెల్యే రాఖీ బిర్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఐటీఓ ప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేశారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆప్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version