ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఏ రేంజిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే కేరళలో మళ్లీ రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం మొత్తం, తిరువనంతపురంలో కూడా లాక్ డౌన్ స్ట్రీట్ గా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో ప్రజలను క్రమబద్ధీకరించేందుకు కమాండోలను రంగంలోకి దించింది.
అయితే తిరువనంతపురం నగరంలోని ఓ ప్రాంతంలో గత నాలుగైదు రోజుల నుండి 600 కు పైగా కరోనా టెస్టులు నిర్వహించగా అందులో ఏకంగా వందకుపైగా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారులు తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో 25 మంది కమాండోలు విధులు నిర్వహిస్తున్నారని డిజిపి తెలియజేశారు. అలాగే చేపల వేటకు వెళ్లే బోట్లు సముద్రం లోకి వెళ్లకుండా, అలాగే తమిళనాడు నుంచి కేరళలోకి బొట్లు రాకుండా కాస్ట్ గార్డ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 2415 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.