రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠను అడ్వాణీ కళ్లారా చూడాలి : బీజేపీ ఎంపీ

-

ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి కూడా రామ్ మందిర్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడ్వాణీని సాదరంగా తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ మాజీ ఎంపీ, రామమందిర ఉద్యమ నేత రాం విలాస్‌ వేదాంతి విజ్ఞప్తి చేశారు.

రామ మందిరంలో రామ్‌ లల్లా (బాల రాముడు) విగ్రహ ప్రతిష్ఠను అడ్వాణీ స్వయంగా ఆయన కన్నులతో చూసి తరించాలి అని రాం విలాస్ అన్నారు. ఇది దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోరిక అని తెలిపారు. ఎందుకంటే రామమందిర ఉద్యమంలో ఆడ్వాణీ పోషించిన పాత్ర మహోన్నతమైనది అని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుత కీలక దశకు బీజేపీ చేరుకోవడంలో వాజ్‌పేయి, అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషిల కృషి ఎంతో ఉందని రాం విలాస్ వేదాంతి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version