భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న జేఎన్1 వేరియంట్

-

కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జేఎన్1 వేరియంట్గా రూపాంతరం చెందిన ఈ వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు భారత్ వ్యాప్తంగా 157 జేఎన్1 వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇన్సాకాగ్‌ వెల్లడించింది. మరోవైపు దేశంలో ఒకేరోజు 702 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని, తద్వారా క్రియాశీలక కేసుల సంఖ్య 4,097కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

గురువారం ఉదయం 8.00 గంటల గణాంకాల మేరకు మహారాష్ట్రలో 2, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌, దిల్లీల నుంచి చెరొకటి చొప్పున 6 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 22వ తేదీన అత్యధికంగా 752 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరోవైపు దేశంలో కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 157కు చేరినట్లు ఇన్సాకాగ్‌ గురువారం వెల్లడించింది. నవంబరులో 16 కేసులు నమోదవగా, డిసెంబరు నెల మొదలయ్యాక 141 కేసులను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో కేరళలో అత్యధికంగా 78 కేసులు బయటపడగా, 34 కేసులతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version