రెండో దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఓటింగ్‌ను మూడో దశకు మార్చారు. రెండో విడతలో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు 1,202 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రెండో దశలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (వయనాడ్‌) బరిలో నిలిచారు. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్‌ విన్పై గురిపెట్టారు.లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (కోటా-బూందీ), కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (జోధ్‌పుర్‌), ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ బరిలో దిగారు. తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, బీజేపీ నేత అరుణ్‌ గోవిల్‌ (మేరఠ్‌), తేజస్వీ సూర్య (బెంగళూరు దక్షిణం), కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ (అలప్పుళ) రెండో దశ బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version