కొనసాగుతున్న ఐదో విడత పోలింగ్​.. ఓటేసిన మాయావతి, అనిల్​ అంబానీ

-

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో నిలవగా..  8 కోట్ల 95 లక్షల మంది ఓటర్లు కోసం ఈసీ 94,732 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ విడతలో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు.

లోక్​సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. బీఎస్​పీ అధినేత్రి మాయావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఐదో దశ లోక్​సభ ఎన్నికల్లో ఓటర్లందరూ కొత్త రికార్డు సృష్టించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఐదో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version