రేపు లోక్‌సభ తుది విడత పోలింగ్‌

-

లోక్సభ ఏడో విడత ప్రచారం ముగిసింది. జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని  57 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో -9, బిహార్ -8, ఒడిశా-6, హిమాచల్ ప్రదేశ్ – 4, ఝార్ఖండ్‌ – 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని ఒకచోట పోలింగ్‌ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే  ఓటింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగియనుంది.

ఏడోవిడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత యూపీలో 144, బిహార్‌ 134, ఒడిషా 66, ఝార్ఖండ్‌ 52 , హిమాచల్‌ 37, చండీగఢ్‌లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ విడతలో అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలు ఐదున్నాయి. అందులో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, కంగనారనౌత్ బరిలోకి దిగిన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో నటుడు రవికిషన్‌ (బీజేపీ), నటి కాజల్‌ నిషాద్‌ (సమాజ్‌వాదీ పార్టీ) , హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, పశ్చిమ బంగాల్‌లోని డైమండ్‌ హార్బర్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version