ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలోనే అత్యంత విషాద ఘటనగా నిలిచింది. ఈ ఘటనతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వందల మంది పిల్లలు అనాథలయ్యారు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఈ ఘటనతో చాలా మంది వారి ఆత్మీయులను కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఓ ప్రేమికుడిని తన ప్రేమకు దూరం చేసింది. కోరమాండల్ బోగీలో ఓ బంగాలీ ప్రయాణికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ డైరీలో రాసుకున్న ‘ప్రేమ గీతాలు’.. ఇప్పుడు నెత్తుటి పట్టాలపై చెల్లాచెదురయ్యాయి.
“చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి” అని బంగాలీలో చేతిరాతతో రాసి ఉంది. “అన్నివేళలా నీ ప్రేమ కావాలి. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు” అని రాసి ఉన్న కాగితాలు ట్రాకులపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనాస్థలిలో బాధిత ప్రయాణికుల వస్తువులను వెలికి తీస్తున్న సహాయ సిబ్బందికి ఈ ప్రేమ కాగితాలు కనిపించాయి. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ డైరీ ఎవరిది? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయంపై మాత్రం తెలియరాలేదు.
Just 2 days back, there was a train accident in Balasore, India.
Too many died and a lot more had serious injuries.
A bundle of love letters and poems were found amongst the debris on the tracks.
A glimpse of a lost romance. A rarity in this age.
Give this post a read. pic.twitter.com/MHUq8LplyD
— Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023