శ్రీరాముడుని విమర్శిస్తూ LPU మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు చేయడంతో తొలగించిన యాజమాన్యం…!

-

పంజాబ్‌, జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన గుర్‌సంగ్ ప్రీత్ కౌర్‌ను రాముడిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తొలగించారు. ఆ ప్రొఫెసర్ చేసిన ఉపన్యాసం తో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. హద్దులు మొత్తం దాటి ఆమె శ్రీరాముడి గురించి ఉపన్యాసం ఇచ్చారు.

 

శ్రీరాముడుని విమర్శిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… రావణుడు చాలా మంచి వ్యక్తి అని మంచి హృదయం కలవారని చెప్పారు. ఆమె రాముడు మంచివాడు కాదని కాస్త జిత్తులమారి అని ఆమె చెప్పారు. సీతని రాముడు ఇబ్బందుల్లో పెట్టేసింది రాముడే అని.. సీతని ఇబ్బందుల్లోకి పెట్టి రావణుడి మీద నిందలు వేస్తారని చెప్పారు.

అలానే ఏది మంచి, ఏది చెడు అని మనం ఎలా నిర్ణయిస్తాము అని ఆమె చెప్పారు. అలాగే ప్రపంచం మొత్తం కూడా రాముడిని పొగుడుతున్నారని రావణుడు చెడ్డవారు అని చెబుతున్నారని ఆమె అన్నారు. అయితే మొత్తం చేసింది రాముడైతే రాముడు ఎలా మంచివాడు అని ఆమె ప్రశ్నించారు. ఆడియో క్లిప్ లో గురుప్రీత్ కౌర్ ఈ విషయాలను చెప్పడం మనం వినొచ్చు. అయితే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన రూల్స్ ని క్రాస్ చేసి ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈమె ఇలా మాట్లాడడం వలన యూనివర్సిటీ నుండి ఆమెను తొలగించారు. పైగా యూనివర్సిటీ గౌరవాన్ని ఆమె తొలగించారు. అన్ని మతాల వారిని సమానంగా చూసి గౌరవంతో వెళ్లే సంస్థలో ఈమె ఇలా చేయడం మంచి పని కాదని యాజమాన్యం అంది. ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్, శ్రీరాముడిపై ఇలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ప్రొఫెసర్‌ను తొలగించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసాక ఫేస్‌బుక్ మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లను గుర్సాంగ్ ప్రీత్ కౌర్ తొలగించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version