ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా..ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు లక్షలాదిగా తరలివస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగనుంది. మహాకుంభ్ కోసం దాదాపు రూ. 7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం.
45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన యోగి సర్కార్….మహాకుంభ్ కోసం దాదాపు రూ. 7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు. సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.