ప్రస్తుతం దేశంలో హనుమాన్ చాలీసా, మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలనే వివాదాలు నడుస్తున్నాయి. ఈ వివాదాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ వివాదాలపై పీడీపీ అధినేత్రి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి స్పందించింది. మనదేశం లౌకిక పునాదిపై ఆధారపడి ఉందని… సెక్యులరిజం మన డీఎన్ఏలో ఉందని ఆమె అన్నారు. బీజేపీ సెక్యులర్ భావాలను చీల్చేందుకు ప్రయత్నిస్తోంది… కానీ భారతీయుల్లో డీఎన్ఏ అలాగే ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తోంది.