Viral Video : గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం

-

అప్పటిదాకా ఆ ప్రాంతమంతా చాలా నిశబ్ధంగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్లున్నారు. మరికొందరేమో తాను పనిచేసే ప్రాంతాలకు వెళ్తున్నారు. అంతలోనే ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి కరెన్సీ నోట్ల వర్షం. ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసేలోగానే చుట్టూ చేరిన జనం. ఆ నోట్ల కోసం ఒకరినొకరు నెట్టేస్తూ ఎగబడ్డారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే..?

గుజరాత్‌లో తమ కుమారుడి వివాహం సందర్భంగా ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది. మెహ్‌సాణా జిల్లా కడీ తాలుకాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. గడిచిన మూడు రోజుల నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. కింద ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడడం వీడియోలో కనిపిస్తోంది. మాజీ సర్పంచ్‌ కరీంభాయి దాదుభాయి జాదవ్‌ మేనల్లుడు రజక్‌ వివాహం సందర్భంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబంలో రజక్‌ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఇలా చేశారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version