పార్లమెంట్‌లో పట్టువిడువని విపక్షాలు.. ఉభయ సభలు వాయిదా

-

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ అంశం అట్టుడికిస్తోంది. మణిపుర్‌ అల్లర్లపై చర్చతోపాటు, ప్రధాని ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి దిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రకటన చేశారు.

బిల్లును హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిందని.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని కేజ్రీవాల్‌ బృందం గుర్తుంచుకోవాలని ప్రహ్లాద్‌ జోషి అన్నారు. మరోవైపు..  మణిపుర్‌ అంశంపై చర్చకు ఇండియా కూటమి సభ్యులు పట్టుబడుతూ.. నినాదాలు చేయడంతో, సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటన చేశారు.

రాజ్యసభ ప్రారంభం కాగానే.. మణిపుర్‌ ఘటనపై చర్చ జరగాలని, ప్రధాని సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి సభ్యులు నినాదాలు చేశారు. మణిపుర్ అంశంపై నిన్న చర్చ జరగాల్సి ఉందని, అది జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో విపక్ష కూటమి సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version