మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ తొలగింపు

-

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌పై వేటు వేశారు. ఆయనకు పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తన సోదరుడు (ఆకాశ్‌ తండ్రి) ఆనంద్‌ కుమార్‌ ఇంతకుముందు మాదిరిగా పార్టీ జాతీయ సమన్వయ కర్త బాధ్యతలు నిర్వర్తిస్తారని మాయావతి చెప్పారు. ఆకాశ్ కేవలం ఐదు నెలల్లోనే తన పదవి కోల్పోవాల్సి వచ్చింది.

“బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు. ఆత్మగౌరవం, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపు. కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దానికోసమే అంకితం చేశాం. కొత్తతరాన్ని కూడా అందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్‌ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, ఉత్తరాధికారిగా ప్రకటించాం. అయితే పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తి పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నాం. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్‌ కుమార్‌ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు” అని మాయావతి పోస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version