ఢిల్లీలో రైతుల నిరసన జరిగిన సంగతి తెలిసినదే. అయితే రైతుల నిరసనలపై విదేశీ వ్యక్తులు చేసిన కామెంట్ల పై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటువంటి వాటిని అనే ముందు వాస్తవాలను తెలుసుకుంటే మంచిది అని మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ నిరసనలకు సంబంధించి సోషల్ మీడియా లో హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం, విపరీతంగా కామెంట్స్ చెయ్యడం అనేకం జరిగాయి. పైగా చాల మంది ప్రముఖులు కూడా స్పందించారు.
ఇది ఇలా ఉండగా రైతుల్లోని కొన్ని స్వార్థ పరమైన గ్రూపులు తమ ఎజెండాను ఈ ఆందోళనలకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. విదేశాంగ శాఖ మరో విషయం కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే..? ఇలా పాల్పడే ఈ గ్రూపులే ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్నాయని ప్రకటన లో తెలియ జేయడం జరిగింది. అయితే ఇటువంటి వాళ్ళ వలనే కొన్ని దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాల ధ్వంసం జరుగుతోందని పేర్కొంది. ఇలా జరగడం వలన ఇది ఇండియాను చాలా బాధించిందని స్పష్టం చేసింది.