బిలియనీర్ల ప్రయోజనాల కోసమే మోడీ పని చేస్తున్నారు : రాహుల్ గాంధీ

-

బిలియనీర్ల ప్రయోజనాల కోసమే భారత ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని మోడీ పై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడుతుంటే.. బీజేపీ మాత్రం దానిని చెత్త బుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Rahul Gandhi

రాహుల్ గాంధీ రెడ్ బుక్ చూపెడుతున్నారని ప్రధాని మోడీ చెబుతున్నారు. దాని రంగు ముఖ్యం కాదు.. అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం అన్నారు. దానిని చదివి ఉంటే.. విద్వేషం వ్యాప్తి, సమాజాన్ని విభజించే ప్రయత్నం చేయరు. ఇది విపక్ష కూటమి, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుంటే.. కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. 56 అంగులాల చాతి కలిగిన వ్యక్తికి తాను భయపడనని.. ఆయన సంపన్నులు చెప్పినట్టు వింటారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version