ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్.. భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి నాంది పలుకుతోందని అన్నారు. దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని తెలిపారు. విదేశీ పర్యాటకులకు ఆహ్వానం పలికిన మోదీ.. భారత్ గొప్పతనాన్ని స్వయంగా ఆస్వాదించవచ్చని వారికి పిలుపునిచ్చారు.
భారత్‌లో తయారైన ఈ తొలి నౌకలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణాన్ని చేయనున్నారు. వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు వీరి ప్రయాణం సాగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది. రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
Beginning of cruise service on River Ganga is a landmark moment. It will herald a new age of tourism in India. https://t.co/NOVFLFrroE
— Narendra Modi (@narendramodi) January 13, 2023