ల్యాప్ టాప్ చార్జింగ్ త్వరగా అయిపోతుందా..అందుకు కారణాలు కూడా లేకపోలేదు..ల్యాపీ వినియోగం పెరిగిపోవడంతో దాని జీవితకాలం కూడా రోజు రోజుకు తగ్గిపోతోంది. ముఖ్యంగా మీ ల్యాప్‌టాప్ పాతబడటం ప్రారంభించినప్పుడు.. అందుకే మీరు ఎప్పటికప్పుడు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ అంటే బ్యాటరీ లైఫ్‌కి సంబంధించిన హెల్త్ చెకప్‌ని చెక్ చేస్తూ ఉండాలి.అందుకు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీరు విండోస్ 10 వాడుతున్నట్లయితే..మీరు సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. దీని కోసం, విండోస్ సెర్చ్ లేదా స్టార్ట్ మెనూలో ‘cmd’ లేదా ‘కమాండ్ ప్రాంప్ట్’ని సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఫైల్ పాత్‌తో కూడిన విండోను కనిపిస్తుంది.. ఇది నలుపు రంగులో లేదా వేరే రంగులో ఉంటుంది.. powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా చేయడం వల్ల సేవ్ చేయబడిన బ్యాటరీ లైఫ్ టైమ్ రిపోర్ట్ మెసెజ్ మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనితో పాటు, స్క్రీన్‌పై ఫైల్ పాత్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు బ్యాటరీ రిపోర్ట్‌ను చూడవచ్చు..
ఇకపోతే మరో పద్దతి కూడా ఉంది..మీరు యూజర్ ఫోల్డర్‌కి వెళ్లి C:Users[Your_User_Name]battery-report.html అని టైప్ చేయండి. ఆ తర్వాత బ్యాటరీ గురించి పూర్తీ వివరాలను తెలుసుకోవచ్చు..మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కూడా ఈ ఫోల్డర్‌ని చూడవచ్చు.బ్యాటరీ మొత్తం వివరాలను తెలుసుకోవచ్చు..అంతేకాదు.. మీరు బ్యాటరీని, ల్యాప్ టాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో కూడా రిపోర్టు రికార్డు చేస్తుంది. అలాగే.. ల్యాప్‌టాప్ AC ఛార్జర్‌లో రన్ అయ్యే సమాచారాన్ని కూడా చూడవచ్చ. బ్యాటరీ, AC ఛార్జర్ రెండింటినీ పోల్చడం ద్వారా మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీ పవర్ కెపాసిటీ తెలుసుసుకోవచ్చు. ఇదండీ ఇలా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు..