పాకిస్థాన్‌ వక్రబుద్ధి మారడం లేదు – మహ్మద్ షమీ

-

పాకిస్థాన్‌ వక్రబుద్ధి మారడం లేదని భారత పేసర్‌ మహ్మద్ షమీ విమర్శలు చేశారు. వరల్డ్ కప్ లో తన ప్రదర్శన చూసి పాక్ మాజీ క్రికెటర్లు కుళ్ళుకుంటున్నారని భారత పెసర్ మహ్మద్ షమీ అన్నారు. ‘ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీశాను.

Mohammed Shami takes a dig at ex-Pakistan cricketers for their inexplicable conspiracy theories

ఆ తర్వాత మ్యాచ్ లో 4, మరోసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాను. దీనిని ఆ దేశ మాజీ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ప్రత్యేకంగా వేరే బంతిని వాడుతున్నట్లు ప్రచారం చేశారు. వసీమ్ అక్రమ్ నన్ను ప్రశంసించినా వారి వక్రబుద్ధి మారడం లేదు” అని షమీ విమర్శించారు.

ఇది ఇలా ఉండగా….టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తల్లి అనుమ ఆరా అస్వస్థకు గురయ్యారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version