ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదు : సీఎం కేసీఆర్

-

తాండురులోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదు అన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికలు వస్తే ఆగం కావద్దు. అభ్యర్థుల గుణగణాలు పార్టీల చరిత్ర చూడాలి. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు అందివ్వలేదు. బీఆర్ఎస్ పాలనలో మారుమూల ప్రాంతంలో నీళ్లు తెచ్చిఇచ్చిందని తెలిపారు. రైతులు చల్లగా ఉంటే దేశం బాగుంటుంది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే.. రైతులకు పంటలుంటాయి. ట్రాన్స్ ఫార్మర్ కాలకుండా.. మోటార్లు కాలకుండా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు గోస దీశారు. ప్రజల నీళ్ల కోసం అవస్థలు పడ్డారు.

కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్ ని రూ.2వేలు చేసుకున్నామని తెలిపారు. తాండూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంత మంది కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ధరణి తీసేసి భూమాత పెడతామంటున్నారు కాంగ్రెస్ నేతలు.. అది భూమాతనా.. భూమేతనా..? అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్. తాండూర్ లో రోహిత్ రెడ్డిని గెలిపిస్తే మీకు లాభం జరుగుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version