మరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. అవిశ్వాస తీర్మానానికి రాజ్ థాక్రే మద్దతు

-

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం బుధవారం మరో కీలక మలుపు తిరిగింది. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన( ఎంఎన్ఎస్) మద్దతు పలికింది. ఈమేరకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజెపి, షిండే వర్గాలతో కూడిన కూటమికి ఆయన మద్దతు ప్రకటించారు.

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించాలంటూ మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో షిండే వర్గం ఎమ్మెల్యేలతో కలుపుకుంటే బీజేపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్లే లెక్క. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం రాజ్ థాక్రేకు ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనికి రాజ్ థాక్రే మరోమాట లేకుండానే ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version